మనము నమ్మే వాక్య సిద్ధాంతాలు

- లేఖనములు/పరిశుద్ధ గ్రంధం - Bible
-
దేవుడు తాను చేసిన సృష్టి ద్వారా, తన కుమారుని ద్వారా, మరియు తన వాక్యము ద్వారా తన్ను తాను మనుష్యులకు కనుపరచుకున్నాడు. బైబిల్ లో ఉన్న 66 పుస్తకములు (క్రొత్త మరియు పాత నిబంధనలు) ద్వారా | దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడని నమ్ముచున్నాము. దేవుని వాక్యము (బైబిల్) చదువుట వలన దేవుని పట్ల విశ్వాసము కలుగుతుంది (రోమా 10:17). వాక్యము అక్షయమైన విత్తనము వంటిది. వాక్యము జీవమైనది (1 పేతురు 1:23). వాక్యము మనలను బాగుచేస్తున్నది (కీర్తన 107:20). బైబిల్ సంపూర్ణమైన దేవుని వాక్యమై ఉన్నది (2 తిమోతి 3:16).
పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బిడ్డలను ప్రేరేపించి బైబిల్ని వ్రాయించాడు (2 పేతురు 1:20-21). పరిశుదాత్మ మన హృదయములను వెలిగించుట ద్వారా బైబిల్ లో తెలియపరచబడిన సత్యమును నిజముగా గ్రహించగలము (1 యోహాను 2:20-21). నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది (కీర్తన 119:38). సంపూర్ణ అధికారం కలిగినది. బైబిలే మన విశ్వాసానికి జీవితానికి ఆధారము (కీర్తన 19:7, మత్తయి 24:35, యెషయా 55:10- 11). దేవుడు మానవులకు చెప్పాల్సినది సంపూర్ణముగా బైబిల్ లో తెలియజేసాడు. బైబిల్ లో నుండి ఏదియు తీయకూడదు ఏదియు జతపరచకూడదు (ప్రకటన 22:18 19, సామెతలు 30:5-6). బైబిల్ ఆధారం చేసుకొని మానవుని ప్రవర్తనను, నమ్మకాలను, అభిప్రాయాలను దేవుడు తీర్పులోనికి తీసుకొనివస్తాడు. (యోహాను 12:48)
- ఏకైక సత్య దేవుడు - One True God
-
దేవుడు ఒక్కడే (ద్వితి 6:4). ఈ ఏకైక సత్య దేవుడు విడదీయలేని విధంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను
ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు (మత్తయి 28:19, యోహాను 14:26, 2 కొరింధీ 13:14). దైవత్వములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు సమానులే. దేవుడు సర్వమునూ సృష్టించిన సృష్టికర్త, భూమ్యాకాశములను పరిపాలించు వాడైయున్నాడు (ప్రకటన 4:11). ఆయన అనంతుడు, పరిశుద్ధుడు, నిత్యుడు, ఆత్మ స్వరూపి (యెషయా 40:28). మన ఆరాధనకు, గౌరవమునకు, పరిచర్యకు అర్హుడు (యెషయా 6:3). ఆయన తన పరిశుద్ధతలో, న్యాయములో, జ్ఞానములో, దయలో, ప్రేమలో ఎన్నటికీ మార్పులేనివాడు (సంఖ్యా|| 23:19, యాకోబు 1:17).
ఆయన సమస్తమును తన మహిమ కొరకు సృష్టించాడు (యెషయా 43:7, ఎఫెసీ 1:12). దేవుడు తన గురించి ప్రత్యక్షపరచుకొంటేనే తప్ప దేవుని గురించి ఎవ్వరూ తెలిసికోజాలరు. (రోమా 3:11, యిర్మీయా 29:13-14). దేవుని యొక్క మహిమ కొరకు త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులు విభిన్నమైన బాధ్యతలను పరిపూర్ణమైన ఐక్యతతో మన రక్షణ కొరకు నిర్వహించుదురు (1 పేతురు 1:1-2).
- కుమారుడైన దేవుడు - God The Son
-
యేసు క్రీస్తు దేవుని కుమారుడు అనగా తండ్రియైన దేవునితో సమానుడు (మార్కు 1:1 యోహాను 5:18). మానవునికి దేవుని గురించి పరిపూర్ణంగా తెలియపరచడానికి వచ్చిన శరీరధారియగు దేవుడు (యోహాను 1:14, కొలొ॥ 1:15-16). యేసు క్రీస్తు సంపూర్ణమైన దేవుడైయుండి ఈలోకానికి రావటానికి మానవ రూపాన్ని ధరించారు (ఫిలిప్పీ 2:7). ప్రభువైన యేసుక్రీస్తు కన్య మరియ గర్భము ద్వారా పరిశుద్దాత్మ వలన ఈ లోకములో జన్మించారు (మత్తయి 1:20). కనుక ఆయన జన్మము పవిత్రము. పాపరహిత జీవితమును జీవించారు. పాపులకు బదులుగా సిలువలో మరణించి, వారి కొరకైన ప్రాయశ్చిత్తమును చేసారు (1 యోహాను2:1). మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు (అపో. కార్య॥ 2:23- 24). ఆరీతిగా తన దైవత్వాన్ని నిరూపించాడు. ఎవరైనా సరే మారుమనస్సు పొంది అయన దగ్గరకు విశ్వాసముతో వస్తే గొప్ప రక్షణ ఇస్తాడు.
- దేవుడైన పరిశుద్ధాత్ముడు - God the Holy Spirit
-
త్రిత్వములో పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమారులతో సమానుడు (మత్తయి 28:19). ఆయన దేవుడు (అపో ! 5:3-4). క్రీస్తును మహిమపరచుటకు, రక్షణ కార్యమును | ఆపాదించుటకు పరలోకమునుండి పరిశుద్ధాత్ముడు తండ్రి చేత (యోహాను 14:26), కుమారుని చేత (యోహాను 15:26) పంపబడ్డాడని నమ్ముచున్నాము. ఆయన పాపమును గూర్చి లోకమును ఒప్పింపచేయును (యోహాను 16:8). ఆయన నూతన జన్మను అనుగ్రహించును (యోహాను 3:5). ఆయన వాక్యమును బట్టి మనస్సును వెలిగింపచేయును. లేఖానుసారమైన పరిశు ద్ధ జీవితమును జీవించుటకు బలమునూ, రక్షణ విషయమైన నిశ్చయతను వారికి అనుగ్రహించును (రోమా 8:13-14). ఆత్మ దేవుడు సర్వసత్యము లోనికి మనలను నడిపిస్తాడు (1 కొరింథీ 2:12). ప్రతి నిజమైన విశ్వాసి పరిశు ద్ధాత్మ బాప్తీస్మమును పొందును (అపో.కా|| 2:38, 1 కొరింధీ|| 12:13). అనగా ఆయన విశ్వాసులను క్రీస్తు శరీరములోనికి తెచ్చి, సంఘమును బలపరచి, వారు దేవుని ఆరాధించు వారిగాను, పరిచర్య చేయువారిగాను చేయును (ఎఫెసీ॥ 5:18-20). ఆయన వారిలో ఎల్లప్పుడు నివసించును (యోహాను 14:16). ఆయన చిత్తప్రకారము, సంఘములో, అనేకులకు వివిధ రకములైన కృపా వరాలను అనుగ్రహించి • సంఘమును బలపరచును (1 కొరింధీ॥ 12:4,46). క్రీస్తు శరీర ప్రయోజనార్థమై పరిశుధ్ధాత్మ కృపా వరాలను అనుగ్రహిస్తూ ఉంటాడు (1 కొరింధీ॥ 12:7). సంఘ ప్రారంభ దినాల్లో అపొస్తలుల బోధను ధృవీకరించడానికి అద్భుత వరాలు ఉపయోగించ బడ్డాయి (2 కొరింధీ॥ 12:12). విశ్వాసుల జీవితాల్లో నిరంతరం ఉండాల్సిన లక్షణాలుగా అవి ఎన్నడూ ఉద్దేశించబడలేదు. భాషలు మాట్లాడే వరం విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచనగా ఉండేది (1 కొరింథీ 14:22).
- మానవుడు - MAN
-
దేవుడు మానవుని ఆయన స్వరూపమందు సృష్టించాడని నమ్ముచున్నాము (ఆది| 1:26-27). దేవుడు స్త్రీ పురుషులను నమానమైన విలువ మరియు గౌరవములతో సృష్టించాడు (ఆది॥ 1:27, 2:18). దేవుని మహిమపరచి, ఆయనకు లోబడి, ఆయనను ప్రేమించి, ఆయనయందు సంతోషించడమే మానవుని పరమావిధి (కీర్తన॥ 37:4, ప్రకటన 4:11). మనిషి పాపము చేయుట వలన పాప స్వభావమును స్వతంత్రించుకున్నాడు. పాపము వలన మన ప్రతి ఆలోచన (మన హృదయము చెడిపోయినది) మన స్వభావము చెడిపోయినది (ఆది॥ 6:5, రోమా 5:12, యిర్మీయా 17:9). మనము స్వభావసిద్ధం గాను, క్రియ ద్వారాను చెడిపోయినవారము (తీతు 1:15-16, ఎఫెసీ 4:17-18, రోమా 1:28-31). పాపము వలన దేవునితో సమాధానము కోల్పోయాము దేవుని ఉగ్రతకు పాత్రుల మైయ్యాము (రోమా 1:18, ఎఫెసీ॥ 2:3). పాపుల రక్షకుడైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచి మన పాపము క్షమించబడుట ద్వారా మాత్రమే పరిశుద్ధుడైన దేవునితో సమాధానం పొందగలము (2 కొరింధీ 5:19-21).
- మోక్షం - Salvation
-
పాప క్షమాపణ పొంది, స్వభావంలో మార్పునొంది, ఏకైక సత్య దేవునితో సమాధానపడి, మన ఆత్మ నరకము నుండి తప్పింప బడుటయే రక్షణ. ఎవరైతే తమ పాపములు విడిచి పెట్టి రక్షకుడైన యేసు ప్రభువు నందు విశ్వాసముంచు తారో వారిని దేవుడు రక్షిస్తాడు (అపో 4:12, యోహాను 3:16,36, మత్తయి 4:17). ఆత్మ రక్షణ అనేది కేవలం కృపచేత ప్రభువైన క్రీస్తు యేసు నందు విశ్వాసము ద్వారా మాత్రమే సాధ్యమని నమ్ముచున్నాము (యోహాను 3:16, ఎఫెసీ 2:8, తీతు 3:5). ఆత్మ రక్షణ క్రియలు ద్వారా (ఆచారము ద్వారా, మతము ద్వారా, నీతి క్రియలు కలిగి ఉండుట ద్వారా, సొంత ప్రయత్నము ద్వారా) సాధ్యం కాదు. రక్షణ ఉచితముగా అందించడానికి ఈ కార్యమును ప్రభువైన యేసుక్రీస్తు తనజీవితము ద్వారా, సిలువ మరణము ద్వారా సాధించాడు (2 కొరింధీ॥ 5:19-21).
- నీతిమంతులుగా తీర్చబడుట, పరిశుద్ధులుగా మార్చబడుట - Justification
-
యేసు క్రీస్తు నందు విశ్వసించుట ద్వారా క్రీస్తు నీతి మన సొంత నీతిగా దేవుని దృష్టిలో ఎంచబడుటయే నీతిమంతులుగా తీర్చబడుట (రోమా 4:25, 5:1). ఇది ఒకసారే జరిగే ప్రక్రియ. క్రీస్తు నందు విశ్వాసం ద్వారానే | పరిశుద్ధత పొందాము (కొలొస్సి 1:1, గలతి॥ 2:16, రోమా 3:24,28). దేవుడు ఇచ్చిన నీతి ద్వారానే మనము పరలోకానికి అర్హులమవుతాము.
పరిశుద్ధులుగా మార్చబడుట అనేది ప్రతిరోజు క్రీస్తు స్వరూపములోనికి మార్చబడే ప్రక్రియ. ఒక విశ్వాసి | జీవితంలో మార్పు స్పష్టముగా కనబడును (కొలొస్సి 2:7, యోహాను 2:16, రోమా 3:24,28; 2 కొరింథీ॥ 7:1; ఫిలిప్పీ 2:12-13). ఆయన మనకిచ్చిన దేవుని వాక్యం ద్వారా (2 కొరింథీ॥ 7:1), పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా, ఇతర విశ్వాసులతో సహవాసం ద్వారా, ప్రార్థన ద్వారా, సరిచేసుకొనుట ద్వారా, జాగ్రత్తగా ఉండుట ద్వారా మనము క్రీస్తు స్వరూపము లోనికి మార్చబడతాము (2 కొరింథీ॥ 3:18, ఫిలిప్పీ॥ 2:12- 13).
- తిరిగి జన్మించబడుట - Born again
-
మనుష్యులందరూ పాపములో చనిపోయి ఉన్నారని సమ్ముచున్నాము (రోమా 3:10, ఎఫెసీ॥ 2:1). ఆత్మీయముగా | చనిపోయినవారు దేవుని సువార్తకు స్పందించరు, మరియు దేవునికి విరోధముగా జీవిస్తారు (రోమా 8:7). చచ్చిన స్థితి కనుక వారు తమ సొంత ప్రయత్నము ద్వారా తమని తాము రక్షించుకోలేరు. పరిశుద్ధాత్ముడు హృదయమును మార్చి నూతన జీవమును ప్రసాదించి వారిని మరలా జన్మింపచేసి, సువార్త నమ్ములాగున చేసి, వారి పాపమును బట్టి మారుమనస్సు పొందులాగున చేస్తాడు (యెహెజ్కేలు 36:26,
యోహాను 3:5-6). పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. (తీతు 3:5).
- బాప్తీస్మము, ప్రభువు బల్ల - Baptism & Lord's Table
-
ప్రభువైన యేసు క్రీస్తు సంఘమునకు బాప్తీస్మము, ప్రభు బల్ల అను రెండు ఆజ్ఞలను ఇచ్చాడని నమ్ముచున్నాము. ఎవరైతే వారి మనస్సును మార్చుకొని (మారుమనస్సు), క్రీస్తు నందు విశ్వాసముంచి ఆయనకు విధేయులవు తారో వారికి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో నీటిలో బాప్తీస్మమునిస్తారు. ఇది పావ విషయమై మరణించుటకును క్రీస్తులో పునరుత్థాన నూతన జీవము పొందుటకు సూచనగా ఉన్నది (రోమా 6:3-4). బాప్తీస్మము రక్షణను ఇవ్వలేదు కాని, ఒక విశ్వాసి జీవితంలో పరిశు ద్ధాత్ముడు అంతరంగములో చేసిన కార్యానికి సూచనగా వున్నది. బాప్తీస్మము తీసుకొనుట ద్వారా ఒక విశ్వాసి అందరియెదుట క్రీస్తుకు విధేయతను, సంఘములో సభ్యత్వాన్ని, లోకముతో వేరుపరచబడుటను తెలియజేస్తాడు (అపో.కార్య॥ 2:41).
క్రీస్తు మరణ, భూస్థాపన, పునరుద్దాన, ఆగమనాన్ని విశ్వాసులు జ్ఞాపకము చేసుకొనుటకు ప్రభువు బల్లలో పాల్గొంటారు (లూకా 22:14-20). క్రీస్తు శరీరమునకు, ఆయన రక్తమునకు సాదృశ్యముగా ప్రభువు బల్లలో రొట్టె, ద్రాక్షరసము ఉన్నాయి (1 కొరింధీ॥ 11:24-25). రొట్టె, ద్రాక్షారసము సూచనప్రాయంగా ఉన్నాయే తప్ప వాటి స్వభావంలో మార్పు ఉండదు. ప్రభువు బల్ల అనునది సంఘము స్వపరీక్ష చేసుకొనుటకు ఒక అవకాశము (1 కొరింధీ॥ 11:28).
- సంఘము - Church
-
ప్రతి జాతిలో నుండి, ప్రతి భాషలో నుండి యేసు ప్రభువు పిలుపుకు విశ్వాసముతో స్పందించి, పరిశుద్ధపరచ బడి, రక్షింపబడి చేర్చబడినవారు సంఘము (కొలొ 1:13, 1 తిమోతి 3:15). వారు క్రీస్తే శిరస్సుగా ఉన్న సార్వత్రిక సంఘములో పాలిభాగస్తులుగా ఉన్నారు. మరియుసంఘము ప్రభు యొక్క శరీరము. (మత్తయి 16:18, ఎఫెసీ॥ 1:22-23, § 1:18).
ఈ అదృశ్యమైన సార్వత్రిక సంఘము దృశ్యమైనదిగా కనబడేదే స్థానిక సంఘము. ప్రతీ స్థానిక సంఘము దేవుని గృహమై (ఎఫెసీ 2:19), సత్యమునకు స్తంభమునూ, ఆధారమై యున్నది (1 తిమోతి 3:15). దేవుని వాక్యమును విని ఆత్మీయ సూచనలను పొందుకొనుటకు, ఒకరికి ఒకరు ప్రోత్సహించుకొనుటకు, క్రమశిక్షణ స్వీకరించుటకు, ప్రభువు బల్లలో పాల్గొనుటకు, దేవుని ఆరాధించుటకు, కలిసి ప్రార్ధించుటకు, ప్రభు రాకడకొరకు సిద్దపడుటకు | తరచుగా సంఘము సమాజముగా కూడుకుంటారు. (అపో.కార్య|| 2:42, హెబ్రీ 10:24-25), క్రీస్తు ప్రభువును మాదిరిగా చేసుకొని అయన చెప్పినట్టు నడుచుకొనుటయే సంఘము యొక్క ప్రధమమైన భాద్యత (కొలొ 2:6-7), లోకమునకు సువార్తను ప్రకటించుటకు, దేవుని మహిమను ప్రత్యక్షపరచుటకే సంఘమున్నది (ఎఫెసీ॥ 3:9-10).
వాక్యపరంగా సంఘములో పనిచేయువారు కాపరులు (పెద్దలు) (అపో.కార్య|| 20:28, 1 తిమోతి 3:1) మరియు పరిచారకులు (డీకన్స్). కాపరులు సంఘమును నడిపిస్తారు, పరిచారకులు సంఘమునకు పరిచర్య చేస్తారు. (అపో.కార్య|| 6:2-3, 1 తిమోతి 3:8). వాక్యానుసారమైన సువార్త బోధించే ఇతర సంఘములతో మాత్రమే సహవాసం ఉంటుంది (గలతీ॥ 2:9).
- జరుగబోవు విషయము - Future Events
-
సంఘం రెప్పపాటున మార్పుచెంది ప్రభు రాకడలో ఎత్తబడి యేసు ప్రభువును మధ్యాకాశములో కలుసుకొనును. మృతులైన విశ్వాసులు సహితం తిరిగి లేచి రెప్పపాటున మార్పుచెంది ఆయనను మధ్యాకాశములో కలుసుకొనును. ఏడు సంవత్సరములు లోకమునకు మహా శ్రమ కలుగును. అనంతరం ప్రభువైన యేసుక్రీస్తు తన మహిమతో 1000 ఏళ్ళు మహా పరిపాలన చేయుటకు సంఘముతో కలిసి భూమిపైకి తిరిగి రెండవ మారు వస్తాడని నమ్ముచున్నాము (అపో.కార్య॥ 1:11, 1
కొరింథీ॥ 4:5, ప్రకటన 22:20). మన ప్రభువైన క్రీస్తు లోకమునకు నీతితో తీర్పు తీరుస్తాడు (1 కొరింథీ॥ 15:52, హెబ్రీ| 9:27) దుష్టులు (ఎవరైతే యేసుక్రీస్తును తిరస్కరించారో) నిత్య నాశనాన్ని, నీతిమంతులు (ఎవరైతే క్రీస్తుయందు నమ్మిక ఉంచారో) వారు నిత్యజీవాన్ని నూతన ఆకాశమును, నూతన భూమిని పొందుకుంటారు. (యోహాను 3:36, 5:28-29, అపో.కార్య॥ 24:15, ప్రకటన 20:15). నూతన సృష్టిలో పాపము గాని, వ్యాధి గాని, బాధ గాని, మరణము గాని ఉండదు (యెషయా 65:17, ప్రకటన 21:4,27).