బ్రదర్. జాన్ సుందర్ (M.Tech., M.Div.)

    మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన ప్రత్యేకమైన కృపచేత నన్ను ఏర్పాటు చేసుకొని, నాకు ఆయన వాక్యాన్ని అధ్యయనం చేయడానికి ఆసక్తిని, ఆయన సంఘాన్ని కాచే హృదయాన్ని మరియు ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వివరించే నిబద్ధతను ఇచ్చారు. 2009లో పాస్టోరల్ ట్రైనింగ్ సెమినరీ, పూణే-ఇండియా (ది మాస్టర్స్ అకాడమీ ఇంటర్నేషనల్, USA యొక్క అనుబంధ సంస్థ) నుండి గ్రాడ్యుయేట్ అయ్యేలా ప్రభువు సహాయం చేశారు. సెమినరీలో, డాక్టర్ జాన్ మాక్‌ఆర్థర్ యొక్క వచనం-వెంబడి-వచనం వివరణాత్మక బోధనా పద్ధతిని నేర్చుకున్నాను. దేవుని వాక్యాన్ని ఎలా సరిగ్గా అర్ధం చేసుకోవాలో మరియు బోధించాలో నేను నేర్చుకున్నాను.
    2009 నుండి, నేను విశాఖపట్నంలోని బేతేల్ అసెంబ్లీ చర్చిలో (సత్యం జంక్షన్) పాస్టర్‌గా పని చేస్తున్నాను. మా తాతగారు పాస్టర్ గండి అబ్రహం జాన్ గారు 1974లో బేతేల్ అసెంబ్లీ చర్చిని (సత్యం జంక్షన్) ప్రారంభించారు. రుషికొండలో కూడా మరొక సంఘాన్ని 1994 లో స్థాపించడానికి ప్రభువు సహాయం చేశారు. అక్కడ మా నాన్న గారైన గండి రవి కుమార్ గారు పరిచర్య చేస్తున్నారు. ప్రతీ వారం మా సంఘంలో బైబిల్ స్టడీ, ప్రార్ఠనా కూడికలు, గృహ కూడికలు, యవ్వనస్తుల కూడికలు మరియు సువార్త ప్రకటించే కార్యక్రమాలు ఉంటాయి. ఈ పరిచర్య ద్వారా సంఘానికి శ్రేష్టమైన వాక్యాన్ని అందించి, పరలోకం కొరకు సిద్ధపరచడం మా ముఖ్య ఉద్దేశ్యం.
    నేను అక్టోబర్ 2012లో హెలెనాను వివాహం చేసుకున్నాను, హెలెనా డాక్టర్. ఆమె ప్రభువును ప్రేమిస్తుంది. ఆమె సండే స్కూలు పిల్లలకు దేవుని వాక్యాన్ని బోధిస్తుంది. మన ప్రభువు మాకు ముగ్గురు పిల్లలను అనుగ్రహించాడు అబ్రహం జాన్ ఎబెనెజర్, అలెథియా క్రిసోల్ మరియు ఒబేద్ ఈతాన్. పెద్దవాడు అబ్రాహాము ప్రభువునందు నిద్రించాడు. నన్ను దేవుని పట్ల భయభక్తులతో పెంచిన మా నాన్నగారు గండి రవి కుమార్ గారు మరియు మా అమ్మగారు గండి దేవి సుందరి గారికి, అలాగే నేను ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో నన్ను దైవ భక్తిలో ప్రోత్సహించిన మా బాబాయి గారైన గండి జాషువా జూడ్ గారికి నేను కృతజ్ఞుడనై ఉన్నాను.

పైకి